Dudhsagar Falls: దూద్‌సాగర్ వద్ద ట్రెక్కర్లతో బిస్కీలు తీయించిన పోలీసులు.. వీడియో వైరల్
Dudhsagar Falls: దూద్సాగర్ను చూసేందుకు వెళ్లిన ట్రెక్కర్లకు ఊహించని షాక్ తగిలింది. రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న యువకుల్ని పట్టుకుని వాళ్లతో గుంజీలు తీయించారు పోలీసులు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
బెల్గావ్: గోవా-కర్నాటక బోర్డర్ వద్ద ఉన్న దూద్‌సాగర్ జలపాతం(Dudhsagar Falls) చాలా పాపులర్. ఆ పర్యాటక ప్రాంతాన్ని చాలా మంది విజిట్ చేస్తుంటారు. ఇక వర్షాకాలం జలపాతాన్ని చూసేందుకు జనం ఎగబడుతుంటారు. ప్రస్తుతం వానాకాలం కావడంతో ఆ వాటర్ ఫాల్స్‌ను తిలకించేందుకు జనం ఎగబడ్డారు. బెంగుళూరు, మంగుళూరు, బెల్గావ్, ఉత్తర కన్నడ, హుబ్లీ-ధర్వాడ్, బగల్కోట్, పుణెల నుంచి ట్రెక్కర్లు వస్తుంటారు. ఆ సీనిక్ స్పాట్ వద్ద పర్వతారోహణ చేసేందుకు యువత చాలా ఆసక్తి చూపిస్తారు.
అయితే తాజాగా దూద్సాగర్ను చూసేందుకు వచ్చిన యువకులతో .. రైల్వే పోలీసులు బిస్కీలు తీయించారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రైల్వే ట్రాక్ వద్దే యువతతో ఆ పనిచేయించారు. నిర్దేశిత స్టేషన్ కన్నా ముందే రైలు దిగి.. ట్రాక్ వెంట ట్రెక్కింగ్ చేస్తున్న యువతను పట్టుకుని పోలీసులు ఆ శిక్ష వేయించారు. ఫాల్స్‌ను చూసేందుకు వచ్చిన యువకులు పోలీసుల ఆదేశాల ప్రకారం గుంజీలు తీశారు.
https://twitter.com/IamNavinaveen/status/1680554102852386816?s=20
సాధారణంగా సౌత్ గోవాలోని కొల్లెమ్ స్టేషన్ దగ్గర రైలు దిగిన విజిటర్స్.. రైలు మార్గం వెంట దూద్‌సాగర్ చేరుకుంటారు. అయితే వర్షాకాలం నేపథ్యంలో ఇటీవల అటవీశాఖ, రైల్వేశాఖ, గోవా పోలీసులు ఓ వార్నింగ్ ఇచ్చారు. కొండచరియలు విరిగిపడే ఘటనలు జరిగే అవకాశం ఉన్నందును ట్రెక్కింగ్ బ్యాన్ చేశారు. సంగేం తాలూకాలో ఉన్న మైనాపి జలపాతం వద్ద ఇటీవల ఇద్దరు యువకులు మరణించారు. దీంతో గోవా ప్రభుత్వం వాటర్ ఫాల్స్ వద్ద ట్రెక్కింగ్‌ను నిషేధించింది.
ప్రమాదకరమైన కొండ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ వెంట వాకింగ్ చేయడాన్ని రైల్వేశాఖ నిషేధించింది. రైల్వే చట్టంలోని 147, 159 కింద నేరమని కూడా ప్రకటించింది. ప్రయాణికులు సహకరించాలని, లేనితో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ చట్టం ప్రకారమే దూద్సాగర్ను తిలకించేందుకు వచ్చిన యువతతో బిస్కీలు వేయించారు.
పశ్చిమ కనుమల్లోని మండోవి నదికి చెందిన జలపాతం పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది. ఆ జలపాతం దాదాపు 1017 ఫీట్ల ఎత్తులో ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

