కోల్‌కతా: ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన కోల్‌కతా ఆర్జీ కార్ వైద్య కళాశాల, దవాఖాన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై కళాశాల మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. సందీప్ ఘోష్ అనేక అక్రమాలకు పాల్పడేవాడని, అనాథ శవాలను అమ్ముకుంటూ వ్యాపారం చేసేవాడని ఆరోపించారు. బయోమెడికల్ వ్యర్థాలను, ఔషధాలను సైతం అమ్మేసేవాడని, ఇవి బంగ్లాదేశ్‌కు అక్రమంగా రవాణా అయ్యేవని అన్నారు. విద్యార్థులను పాస్ చేయించడానికి లంచాలు తీసుకునేవాడని, డబ్బుల కోసం కొందరు విద్యార్థులను కావాలనే ఫెయిల్ చేయించేవాడని ఆరోపించారు. కళాశాలకు సంబంధించి ప్రతి టెండర్లో సందీప్ ఘోష్ 20 శాతం లంచం తీసుకునేవాడని, టెండర్లను తన సన్నిహితులైన సుమన్ హాజ్ర, బిప్లబ్ సింఘాలకు చెందిన 12 కంపెనీలకే ఇచ్చేవాడని అన్నారు.
నిందితుడు మాజీ ప్రిన్సిపల్ సెక్యూరిటీనే
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ మాజీ ప్రిన్సిపల్ సెక్యూరిటీగా పని చేస్తున్నట్టు అఖ్తర్ అలీ ఆరోపించారు. తాను మాజీ ప్రిన్సిపల్ అక్రమాలపై గతంలోనే రాష్ట్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత విధించిన విచారణ కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నానని, సందీప్ ఘోష్ అక్రమాలకు పాల్పడ్డాడని విచారణలో తేలినా ఆయనపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆయనపై విచారణ నివేదికను రాష్ట్ర వైద్య శాఖకు పంపించిన రోజే తనను ఆర్జీ కార్ దవాఖాన నుంచి బదిలీ చేశారని, మిగతా ఇద్దరు విచారణ కమిటీ సభ్యులనూ ట్రాన్స్ఫర్ చేశారని అన్నారు. సందీప్‌కు పెద్దవాళ్ల మద్దతు ఉందని, అందుకే రెండుసార్లు బదిలీ అయినా మళ్లీ ఇదే దవాఖానకు పోస్టింగ్ తెచ్చుకున్నారని పేర్కొన్నారు.