ఓటు వేసేందుకు ప్రయత్నిస్తా… విమర్శలపై జయంత్ చౌదరి స్పందన
లక్నో: తాను ఓటు వేసేందుకు ప్రయత్నిస్తానని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌదరి తెలిపారు. ఓటింగ్‌కు ఆయన దూరంగా ఉన్నట్లు వస్తున్న విమర్శలపై స్పందించారు. తనకు మధురలో ఓటు ఉందని జయంత్ చౌదరి చెప్పారు. తొలి, రెండో విడత పోలింగ్ మధ్య రెండు రోజుల గ్యాప్ మాత్రమే ఉందన్నారు. దీంతో తాను ప్రస్తుతం బిజ్నోర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. తన భార్య గురువారం ఉదయమే ఓటు వేసినట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తాను కూడా సాయంత్రం ఆరు గంటలలోపు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. తన భార్య ఓటు వేసిన ఫొటోను ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు.
కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) జతకట్టాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్‌తో కలిసి జయంత్ చౌదరి గురువారం బిజ్నోర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో జయంత్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారంటూ బీజేపీ నేతలు విమర్శించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఓటు వేయలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఇది వారి వంశ దురహంకారాన్ని తెలియజేస్తున్నదని ఆరోపించారు. అలాంటి వారికి ప్రజాస్వామ్య శక్తి తగిన సమాధానం ఇస్తుందన్నారు. యూపీలోని బిస్వాన్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమితోపాటు కాంగ్రెస్ పార్టీపై జేపీ నడ్డా మండిపడ్డారు.
चारु ने किया मथुरा में मतदान! pic.twitter.com/7MgO1tW1Em
— Jayant Singh (@jayantrld) February 10, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

