మైసూరు: ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తూ తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు వస్తున్న వార్తలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బుధవారం ఖండించారు. నవంబర్లో డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్మాజీ ఎంపీ శివరామె గౌడ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో మళ్లీ నాయకత్వ మార్పు ఊహాగానాలను రాజేశాయి. దసరా ఉత్సవాల కోసం మైసూరు వచ్చిన సిద్ధరామయ్యను నాయకత్వ మార్పు గురించి విలేకరులు ప్రశ్నించగా అటువంటిదేదీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.