నగరాల్లో సరుకు రవాణాకు యాప్
మధ్యవర్తులతో పనిలేకుండా, సరుకు రవాణా చేసే వాహనం డ్రైవర్‌తో నేరుగా మాట్లాడుకునే విధంగా సరికొత్త యాప్‌ను ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
న్యూఢిల్లీ, నవంబర్ 13: మధ్యవర్తులతో పనిలేకుండా, సరుకు రవాణా చేసే వాహనం డ్రైవర్‌తో నేరుగా మాట్లాడుకునే విధంగా సరికొత్త యాప్‌ను ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘ఆప్ట్ రూట్’ అనే యాప్ ద్వారా వినియోగదారుడు ఎలాంటి కమీషన్లు చెల్లించకుండానే, డ్రైవర్‌తో నేరుగా మాట్లాడుకొని సరుకు రవాణా సేవల్ని పొందేందుకు అవకాశముంది.
‘సరుకు రవాణాలో ఇప్పుడున్న వ్యవస్థ అసంఘటితంగా ఉంది. ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత వాహనం ఖాళీగా తిరుగు ప్రయాణం కావటం డ్రైవర్లు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య. అలాగే ప్యాకింగ్, వాహనం లోపలి ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకునే పద్ధతుల్ని కూడా తెలియజేస్తాం’ అని ఆప్ట్ రూట్ లాజిస్టిక్స్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఎస్ నారాయణ స్వామి చెప్పారు. ఏడాది చివరినాటికి యాప్ సేవల్ని 500కిపైగా నగరాల్లో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామని ప్రొఫెసర్ అనుజ్ ఫౌలియా చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

