న్యూఢిల్లీ: పంటకు పట్టిన తెగులును స్వయంగా గుర్తించి, తగిన పురుగు మందులను చల్లే మర మనిషి(రోబో)ను ఐఐటీ- ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ దిలీప్ కుమార్ ప్రతిహార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ రోబోను ప్రయోగశాలలో, బయట పరీక్షించారు. రానున్న ఆరు నెలల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లోని వ్యవసాయ క్షేత్రంలో దీన్ని పరీక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ రోబో బ్యాటరీని ఛార్జ్ చేసిన తర్వాత దాదాపు గంటన్నర సేపు పని చేస్తుంది. 40-50 మీటర్ల మేరకు పురుగు మందును చల్లుతుంది.