న్యూఢిల్లీ: ఐఐటీ-ఢిల్లీ అంకుర సంస్థ నానోక్లీన్ పొగ తాగే అలవాటును మాన్పించే ఫిల్టర్‌ను ఆవిష్కరించింది. అత్యాధునిక గాలి వడపోత పరిష్కారంతో తయారైన ఈ పరికరం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ధూమపానాన్ని మాన్పించేందుకు కనిపెట్టిన ఫిల్టర్. సిగిబడ్ అని పిలిచే ఈ ఫిల్టర్ వాడటం ద్వారా 3 నెలల కాలంలో ధూమపానం మానేయవవచ్చు! ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ప్రేరణతో రూపొందించిన ఈ ఫిల్టర్ లైట్, అల్ట్రా, ప్రొ స్థాయిల్లో లభ్యమవుతుంది. వీటిలో (పొగాకు మండినప్పుడు వెలువడే రసాయనం), నికోటిన్ స్థాయిలు తగ్గుతూ వస్తాయి.