న్యూఢిల్లీ : పాములనగానే మనలో చాలా మంది భయంతో వణికిపోతుంటారు. అయితే వన్యప్రాణులను కొందరు పెంపుడు జంతువుల్లాగా వాటి ఆలనాపాలనా చూస్తుంటారు. ఇక కారులో కనిపించిన నాగు పామును ఓ వ్యక్తి కాపాడి దాన్ని తిరిగి అడవిలో విడిచిపెట్టిన వీడియో(Viral Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో షేర్ చేయగా పెద్దసంఖ్యలో నెటజన్లను ఆకట్టుకుంటోంది.
King Cobra’s are vital in the food chain for maintaining balance in nature. Here is one nearly 15 feet long rescued & released in the wild.
Entire operation is by trained snake catchers. Please don’t try on your own. With onset of rains, they can be found in all odd places. pic.twitter.com/g0HwMEJwp2
— Susanta Nanda (@susantananda3) May 4, 2023
ఈ క్లిప్‌లో కారులో నాగు పాము కనిపించడంతో అప్రమత్తమైన వ్యక్తి వెంటనే పాములు పట్టుకునే వ్యక్తిని పిలిపించగా ఆ వ్యక్తి పామును కాపాడి దాన్ని అడవిలోకి తిరిగి పంపించడం కనిపిస్తుంది. 15 అడుగుల పొడవైన పామును అతడు ఓ బ్యాగ్‌లో చుట్టి ఆపై దాన్ని అడవిలో వదిలిపెట్టడం చూడొచ్చు.
నాగుపాములు ప్రకృతిని సమన్వయం చేసేందుకు కీలకం..15 అడుగుల పొడవైన నాగుపామును కాపాడి అడవుల్లోకి వదిలిపెట్టం జరిగింది..శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్స్చే ఈ ఆపరేషన్ జరిగిందని, ఎవరూ సొంతంగా ఇలా ప్రయత్నించవద్దని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. వర్షాకాలంలో పాములు బయటకు వస్తాయని జాగ్రత్తగా ఉండాలని రాసుకొచ్చారు. ఈ నాగుపామును చూస్తే తాను వణికిపోవడం ఖాయమని ఓ యూజర్ కామెంట్ చేయగా, క్లాసిక్ హ్యాండ్లింగ్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.