న్యూఢిల్లీ : దక్షిణాదిలోని ఓ టీ ఎస్టేట్‌లో టైగర్ సంచరిస్తున్న వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను తొలుత వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ మనో షేర్ చేయగా ఆపై సుశాంత నంద రీట్వీట్ చేశారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకూ 5,000 మందికి పైగా వీక్షించారు.
Here is a majestic tiger in a tea estate. Some go to Tiger Reserves in Safari, number of times & don’t spot one & some are lucky to have such a grandeur view.
Via @Mano_Wildlife pic.twitter.com/NN73pVRMK2— Susanta Nanda IFS (@susantananda3) February 2, 2023
టీ ఎస్టేట్‌లో టైగర్ తిరుగాడుతోంది..పులులను చూసేందుకు పలువురు సఫారీలో టైగర్ రిజర్వ్‌లకు వెళుతుంటారు..ఇలాంటి టైగర్ వారికి కనిపించదని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతూ పెద్ద సంఖ్యలో రియాక్ట్ అవుతున్నారు.
ఈ వీడియోను చూస్తుంటే తనకు 1980ల్లో ఓల్ట్ లిప్టన్ టైగర్ టీ యాడ్ గుర్తుకువచ్చిందని ఓ యూజర్ రాసుకొచ్చారు. సీనరీ అద్భుతంగా ఉందని, స్వచ్ఛమైన అందమని మరో యూజర్ కామెంట్ చేశారు. నిజంగా గ్రాండ్ అండ్ మేజెస్టిక్ అని మరో యూజర్ ప్రశంసించగా, ఈ టీ ఎస్టేట్ ఎక్కడ ఉందో చెప్పాలని మరో యూజర్ కోరారు.