PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రైవేట్ సెక్రటరీగా (Private Secretary) యంగ్ ఐఎఫ్ఎస్ అధికారిణి (IFS Officer) నిధి తివారీ (Nidhi Tewari)ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నిధి నియామకాన్ని ఆమోదించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) అధికారికంగా ప్రకటించింది.
నిధి తివారీ 2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారిణి. ఆమెది వారణాసిలోని మెహ్ముర్గంజ్. సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంకు తెచ్చుకున్న ఆమె ఇప్పటివరకూ పలు హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంలో)లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 2022 నవంబర్‌లో ఆమె పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరారు. జనవరి 6, 2023 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు, ఆమె వారణాసిలోని అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం చేస్తూనే సివిల్ పరీక్షకు సిద్ధమైన నిధి తివారీ.. ఎట్టకేలకు ర్యాంకు సాధించారు. ఇక పీఎంవోలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వశాఖలో పని చేశారు. నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా నిధి తివారీ సేవలు అందించారు. ఇక ఇప్పటి వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇద్దరు ప్రైవేట్ సెక్రటరీలు వివేక్ కుమార్, హార్దిక్ సతీశ్‌చంద్ర షా ఉన్నారు. ఇప్పుడు మూడో ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ నియమితులయ్యారు.
Also Read..
Modi Retirement: మోదీ రిటైరవుతున్నారా? రౌత్ కామెంట్‌కు ఫడ్నవీస్ కౌంటర్
ASHA Workers: పట్టించుకోని ప్రభుత్వం.. శిరోముండనం చేసుకున్న ఆశా వర్కర్లు
Rahul Gandhi: ఆఫ్‌షోర్ మైనింగ్ టెండర్లు రద్దు చేయండి.. ప్రధానికి లేఖ రాసిన రాహుల్ గాంధీ