Modi Retirement: మోదీ రిటైరవుతున్నారా? రౌత్ కామెంట్‌కు ఫడ్నవీస్ కౌంటర్
Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్కాబోతున్నట్లు శివసేన రూమర్స్ క్రియేట్ చేసింది. అందుకే మోదీ ఆర్ఎస్ఎస్ ఆఫీసుకు వెళ్లినట్లు రౌత్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఖండించారు. 2029లోనూ ప్రధాని అభ్యర్థి మోదీయే అని పేర్కొన్నారు.
ముంబై: ప్రధాని మోదీ రిటైర్(Modi Retirement) కాబోతున్నట్లు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. రౌత్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఖండించారు. 2029 లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రధాని అభ్యర్థిగా మోదీ పోటీ చేస్తారని తెలిపారు. ఈ దేశాన్ని మోదీ ఇంకా చాన్నాళ్లు పాలిస్తారని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని ఆదివారం ప్రధాని మోదీ విజిట్ చేశారు. దీనిపై సంజయ్ రౌత్ వ్యాఖ్యానిస్తూ.. మోదీ తన రిటైర్మెంట్ గురించి సంఘ్ చీఫ్ మోహన్ భగత్‌తో చర్చించేందుకు వెళ్లినట్లు ఆరోపించారు. అయితే ఆ వ్యాఖ్యలను ఫడ్నవీస్ ఖండిస్తూ.. 2029లోనూ ప్రధానిగా మోదీ పోటీ చేస్తారని తెలిపారు.
VIDEO | Addressing a press conference in Mumbai, Shiv Sena (UBT) leader Sanjay Raut says, “PM Modi went to the RSS office (PM Modi’s visit to Nagpur) to announce his retirement. As per my knowledge, he has never visited the RSS headquarters in 10-11 years. RSS wants change in… pic.twitter.com/YCcjYR5MEX
— Press Trust of India (@PTI_News) March 31, 2025
మోదీ వారసులపై ఎటువంటి చర్చ జరగలేదని ఆర్ఎస్ఎస్ నేత సురేశ్ భయ్యాజీ జోషీ తెలిపారు. నాగపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. మోదీ వారసున్ని వెతుకాల్సిన అవసరం లేదన్నారు. మోదీయే తమ నాయకుడని, ఆయన ఆ పదవిలో కొనసాగుతారన్నారు.
నాయకుడు యాక్టివ్‌గా ఉన్న సమయంలో.. ఆయన వారసుల గురించి చర్చించడం భారతీయ సంప్రదాయంలో సరైన అంశం కాదని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. మన సంస్కృతిలో తండ్రి జీవించి ఉండగా వారసుల గురించి ఆలోచించలేమన్నారు. అది మొఘల్ సంస్కృతి అని, ఈ అంశాన్ని చర్చించే సందర్భం రాలేదన్నారు. మోదీ వారసుడు మహారాష్ట్ర నుంచి రానున్నట్లు రౌత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
దేశ రాజకీయ నాయకత్వంలో మార్పు రావాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నదని ఇవాళ రిపోర్టర్లతో మాట్లాడుతూ రౌత్ కామెంట్ చేశారు. సెప్టెంబర్‌లో రిటైర్మెంట్ తీసుకునే అంశాన్ని చర్చించేందుకు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మోదీ వెళ్లి ఉంటారని రౌత్ పేర్కొన్నారు. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు 75 ఏళ్లు నిండగానే రిటైరవుతున్నారన్నారు. ప్రధాని మోదీకి ఈ ఏడాది సెప్టెంబర్‌లో 75 ఏళ్లు నిండనున్నాయి. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన రెండో ప్రధానిగా మోదీ నిలిచారు. గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

