హవేరి: వానొస్తే కార్యాలయం లోపల కూడా గొడుగు పట్టుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోని హవేరి రెవెన్యూ శాఖ కార్యాలయంలో నెలకొంది. 15 ఏండ్ల కాలం నాటి ఈ భవనం సీలింగ్ దెబ్బతింది. మరమ్మతులు చేయించమని, లేదా కార్యాలయాన్ని వేరే ప్రదేశానికి తరలించమని అధికారులకు విన్నవించినా ఫలితం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.