న్యూఢిల్లీ: మతపరమైన కట్టడాలను సర్వే చేయాలనీ, కూల్చివేయాలన్న వాదనలపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటును తవ్వి ఏదన్నా దొరికితే అది నాదే అవుతుందా? అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఒవైసీ మాట్లాడారు. ‘500 ఏళ్ల క్రితం మసీదు ఉండేదా? అని నన్ను అడుగుతున్నారు. పార్లమెంటును తవ్వి ఏదైనా దొరికితే అది నాది అవుతుందా?’ అని నిలదీశారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, దాని నిబంధనలను ఆయన ప్రస్తావించారు. అలాగే మతాలకు సంబంధించిన పలు ఆర్టికల్స్‌ను గుర్తు చేశారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ‘ఆర్టికల్ 26 చదవండి. మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించే, నిర్వహించే హక్కును మతపరమైన వారికి ఈ ఆర్టికల్ ఇస్తుంది. వక్ఫ్‌కు రాజ్యాంగంతో సంబంధం లేదని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రికి ఎవరు బోధిస్తున్నారు? ఆర్టికల్ 26 చదివేలా చేయండి. మీ బలం ఆధారంగా వక్ఫ్ ఆస్తులను లాక్కోవడమే మీ లక్ష్యం’ అని విమర్శించారు. అలాగే దేశంలో ఉర్దూ భాషను అంతం చేసి హిందుత్వ సంస్కృతిని పెంపొందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.
”अगर मैं आज दिल्ली में पार्लियामेंट में खोदू तो यकीनन खान-ए जहां का कुछ ना कुछ मिल जाएगा तो मैं बोल दूं मेरी हो जाएगी?” Barrister @asadowaisi
#AsaduddinOwaisi #Parlimentdelhi pic.twitter.com/sTcDHcueM5
— Maheboob Bagwan (@Maheboobbagwan1) December 14, 2024