ట్రైలర్ బాగుందా?
మేం చూపించిన ట్రైలర్ (రామేశ్వరం కెఫేలో పేలుడు) బాగుందా? అంటూ గుర్తు తెలియని వ్యక్తులు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు.
- 20 కోట్లు ఇవ్వకుంటే మళ్లీ బాంబు పేలుళ్లు
- కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు బెదిరింపు లేఖ
బెంగళూరు, మార్చి 5: మేం చూపించిన ట్రైలర్ (రామేశ్వరం కెఫేలో పేలుడు) బాగుందా? అంటూ గుర్తు తెలియని వ్యక్తులు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ఇది ట్రైలర్ మాత్రమే, తమకు రూ.20 కోట్లు (2.5 మిలియన్ డాలర్లు) ఇవ్వకుంటే.. మరిన్ని చోట్ల బాంబులు పెడతామని దుండగులు లేఖలో బెదిరింపులకు దిగారు.
ఈ విషయాన్ని డీకే శివకుమార్ మంగళవారం మీడియాకు తెలియజేశారు. ‘షాహిద్ ఖాన్ 10786’ నుంచి తనకు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు చెప్పారు. రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు తర్వాత కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా సీఎం, డిప్యూటీ సీఎంలకు బెదిరింపు లేఖలు రావటం తీవ్ర కలకలం రేపుతున్నది. ‘మూడు రోజుల క్రితం సీఎం సిద్దరామయ్య, నాకు ఈమెయిల్ ద్వారా బెదిరింపు లేఖలు వచ్చాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’ అని డీకే శివకుమార్ చెప్పారు. తనకు వచ్చిన బెదిరింపు మెయిల్‌ను మీడియాకు చూపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

