అజ్మల్ కసబ్‌ను కోర్టులో గుర్తుపట్టా: దేవికా రోత్వాన్
mumbai terror attack:2008 సెప్టెంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నగరంలోని ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఊచకోతకు పాల్ప
ముంబై: 2008 సెప్టెంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నగరంలోని ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఊచకోతకు పాల్పడ్డాడు. పోలీసులకు చిక్కిన కసబ్‌కు ఆ తర్వాత ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉగ్రవాది కసబ్‌ను కేసు విచారణ సమయంలో కోర్టులో గుర్తు పట్టినట్లు దేవికా రోత్వాన్ అనే అమ్మాయి తెలిపింది.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన ముంబైలోని తాజ్ హోటల్ లో ఉన్న స్మారకం వద్ద నివాళి అర్పించారు. ఆ తర్వాత ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడ్డ దేవికా రోత్వాన్తో ఆయన మాట్లాడారు. ఉగ్రదాడి జరిగిన రోజున ఛత్రపతి శివాజీ స్టేషన్లో గాయపడినట్లు గుటెర్రస్‌తో దేవిక చెప్పింది. ఆ దాడిలో దేవికకు బుల్లెట్ దిగింది.
ఇక కోర్టులోనూ కసబ్‌ను గుర్తించినట్లు ఆమె యూఎన్ చీఫ్‌కు తెలిపింది. గుటెర్రస్‌తో మాట్లాడిన దేవికా తాను ఉన్నత చదువుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. ఆఫీసర్ కావాలని ఉందని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఉందని కూడా ఆమె గుటెర్రస్‌కు చెప్పింది. గుటెర్రస్‌తో పాటు మహా సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా ముంబై ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

