గుడ్‌న్యూస్ : నాలుగు వారాల్లో ఎపిడెమిక్ నుంచి ఎండెమిక్ దిశగా కొవిడ్-19!

న్యూఢిల్లీ : కరోనా నిబంధనలను విధిగా పాటిస్తే కొవిడ్-19 నుంచి మరో నాలుగు నుంచి ఆరు వారాల్లో భారత్ బయటపడుతుందని ఐసీఎంఆర్ ఎపిడెమాలజీ, అంటువ్యాధుల విభాగం అధిపతి డాక్టర్ సమిరన్ పాండా పేర్కొన్నారు. మనం ముందుగానే కరోనా నిబంధనలను గాలికొదిలేయకుండా జాగ్రత్తలు పాటిస్తే కొవిడ్-19 ఎపిడెమిక్ నుంచి ఎండెమిక్‌గా మారుతుందని, రాబోయే నాలుగు నుంచి ఆరు వారాల్లో పరిస్థితి నిలకడగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇంకా పుట్టుకురాబోయే వేరియంట్స్ స్వభావం గురించి మనకు తెలియకపోయినా ఆర్ఎన్ఏ వైరస్లు, ముఖ్యంగా సార్స్-కోవ్2 విషయంలో నెల నుంచి నెలన్నరలో పరిస్థితి నిలకడగా ఉంటుందని చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో మనం కొత్త టెస్టింగ్ వ్యూహాన్ని, కొవిడ్-19 నిర్వహణ వ్యూహాలను అనుసరించాల్సిన అవసరం నెలకొందన్నారు. భారత్‌లో రాబోయే రోజుల్లో కేసులు తగ్గుతాయనే విషయంలో అప్పుడే మనం ట్రెండ్‌ను అంచనా వేయలేమని రాబోయే మూడు నుంచి నాలుగు వారాల్లో వైరస్ ధోరణిని పసిగట్టవచ్చని అన్నారు.
భారత్‌లో కొన్ని రాష్ట్రాల్లో డెల్టా వేరియంట్ స్ధానంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తిస్తోందని చెప్పారు. ఢిల్లీ, ముంబై నగరాలతో పాటు తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ప్రాబల్య స్ట్రెయిన్‌గా వ్యాపిస్తోందని అన్నారు. ప్రజల అప్రమత్తత, కేసుల గుర్తింపు నిజమైన సవాల్‌గా ముందుకొస్తోందని చెప్పారు. ఒమిక్రాన్ కేసుల్లో చాలావరకూ రోగులు ఆస్పత్రుల్లో చేరే అవసరం లేకపోవడం ఊరట కలిగించే పరిణామమని డాక్టర్ పాండా పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

