హైదరాబాద్: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐసీఎంఆర్) ఇవాళ ఓ కీలక ప్రకటన చేసింది. భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ టీకా.. అన్ని కరోనా వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పింది. సార్స్ సీవొవీ2 కరోనా వైరస్‌కు చెందిన అన్ని రకాల వేరియంట్లను సమూలంగా రూపుమాపుతుందని ఐసీఎంఆర్ తన ట్విట్టర్లో వెల్లడించింది. ఓ స్టడీ ఆధారంగా ఈ నిర్ణారణకు వచ్చినట్లు ఐసీఎంఆర్ చెప్పింది. కరోనాకు చెందిన డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్లను కూడా అత్యంత కచ్చితత్వంతో కోవాగ్జిన్ టీకా నాశనం చేస్తుందని భారతీయ వైద్య పరిశోధనా మండలి స్పష్టం చేసింది.
ICMR study shows #COVAXIN neutralises against multiple variants of SARS-CoV-2 and effectively neutralises the double mutant strain as well. @MoHFW_INDIA @DeptHealthRes #IndiaFightsCOVID19 #LargestVaccineDrive pic.twitter.com/syv5T8eHuR
— ICMR (@ICMRDELHI) April 21, 2021
సార్స్ సీవోవీ2కు చెందినకు చెందిన అన్ని వేరియంట్లను ప్రత్యేకంగా కల్చర్ చేసి వాటిని అధ్యయనం చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఈ అధ్యయనం జరిగినట్లు పేర్కొన్నది. యూకే వేరియంట్ B.1.1.7, బ్రెజిల్ వేరియంట్ B.1.1.28, సౌతాఫ్రికా వేరియంట్ B.1.351ను అత్యంత విజయవంతంగా స్టడీ చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. భారత్‌బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకాలో ఈ వేరియంట్లను నాశనం చేసే సత్తా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నది.
డబుల్ మ్యుటెంట్ వైరస్ B.1.617ను కూడా అధ్యయనం చేశారు. ఈ మ్యుటెంట్ ప్రస్తుతం దేశంలో పలు చోట్ల కనిపిస్తున్నది. B.1.617ను ఐసోలేట్ చేసి, కల్చర్ చేసి అధ్యయనం చేపట్టినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను కూడా కోవాగ్జిన్ సమర్థవంతంగా నాశనం చేస్తున్నట్లు గుర్తించినట్లు ఐసీఎంఆర్ పరిశోధకులు చెప్పారు.