ICMR: పురుషుల ఇంజెక్షన్‌తో గర్భనిరోధకం.. ఐసీఎంఆర్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి
ICMR: ప్రపంచంలోనే తొలిసారి మేల్ కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్‌ను ఐసీఎంఆర్ డెవలప్ చేసింది. పురుషుల ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వీర్య కణాల్లో శక్తి తగ్గుతుంది. దీంతో మహిళల్లో గర్భధారణ అవకాశాలు తగ్గుతాయని ఐసీఎంఆర్ ట్రయల్స్ లో తేలింది. ఆర్ఐఎస్యూజీ ఇంజెక్షన్‌తో ఐసీఎంఆర్ పరీక్షలు నిర్వహించింది.
న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ICMR) సంస్థ కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ప్రపంచంలోనే తొలిసారి మేల్ కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్‌ను డెవలప్ చేసినట్లు తెలిపింది. ఆ ఇంజెక్షన్ తో ఎటువంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవని, చాలా సురక్షితమైందని ఐసీఎంఆర్ వెల్లడించింది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌కు చెందిన ఫలితాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న 303 మందిపై ఆ పరీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ఆండ్రాలజీ జర్నల్‌లో ఆ ఫలితాలను ప్రచురించారు.
సాధారణంగా పురుషులు గర్భనిరోధకం కోసం వాసెక్టమీ లేదా కండోమ్స్ వాడుతుంటారు. అయితే ఐసీఎంఆర్ కొత్త పద్ధతిని డెవలప్ చేసింది. పురుషులకు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా.. స్త్రీలు గర్భం దాల్చకుండా ఆ ఇంజెక్షన్ ను రూపొందించారు. 60 ఎంజీ రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్(ఆర్ఐఎస్యూజీ) ఇంజెక్షన్‌ను పురుషులకు ఇవ్వడం వల్ల.. శక్తిలేనటువంటి వీర్యకణాలను ఉత్పత్తి కానున్నట్లు స్టడీలో తెలిపారు. అజూస్పెరియా కణాలు 97.3 శాతం ఉన్నట్లు నిర్ధారించారు. దీని వల్ల 9902 శాతం గర్భాన్ని నివారించవచ్చు అని స్టడీలో పేర్కొన్నారు.
పురుషులు, స్త్రీల్లో ఉన్న గర్భనిరోధక విధానాల్లో.. తాజాగా అభివృద్ధి చేస్తున్న ఆర్ఐఎస్యూజీ విధానం చాలా సురక్షితమైందని ఐసీఎంఆర్ తెలిపింది. ఢిల్లీ, ఉదంపూర్, లుథియానా, జైపూర్, ఖరగ్‌పూర్‌లలో మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

