ICICI Loan fraud case | కొచ్చర్ దంపతుల పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో పెట్టిన బాంబే హైకోర్టు
ICICI loan fraud case | ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ లోన్ అవినీతి కేసులో కొచ్చర్ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును బాంబే హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. చందాకొచ్చర్
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ లోన్ అవినీతి కేసులో కొచ్చర్ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును బాంబే హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. చందాకొచ్చర్ ఐసీఐసీఐ సీఈవోగా ఉన్న సమయంలో వీడియోకాన్ కంపెనీకి దాదాపు 20 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ రుణ మంజూరు సందర్భంగా చందాకొచ్చర్‌కు భారీగా డబ్బు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంలో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కూడా కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు చందాకొచ్చర్‌ను, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను అరెస్ట్ చేసి విచారించారు. వారితోపాటు వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను కూడా అరెస్ట్ చేసి విచారించారు. ప్రస్తుతం నిందితులంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఈ క్రమంలో కొచ్చర్ దంపతులు తమ అరెస్టును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఈ కేసు నుంచి తాత్కాలికంగా ఉపశమనం కల్పించాలని పిటిషన్లో కోరారు. వారి పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన బాంబే హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నెల 9న తీర్పును వెల్లడించనున్నట్లు పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

