IAS Athar | ఐఏఎస్ అధికారి టీనా దాబి మాజీ భర్త ఐఏఎస్ అథర్ అమీర్ ఖాన్ త్వరలో డాక్టర్ మెహ్రీన్ క్వాజీని వివాహమాడనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ఫొటోలును సైతం షేర్ చేశారు. మెహ్రీన్ సైతం సోషల్ మీడియా ఖాతాల్లో అథర్తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. 2015 టాపర్ అయిన టీనాదాబి.. సెకండ్ ర్యాంకర్ అయిన అధర్ ప్రేమించి, 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లోనే వారి పెళ్లి సంచలనమైంది. పెళ్లయిన రెండేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గతేడాది చివరలో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత టీనా దాబి ఇటీవల ఐఏఎస్ ప్రదీప్ గవాండేను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కశ్మీర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఢిల్లీకి చెందిన డాక్టర్ మెహ్రీన్‌ను పెళ్లి వివాహమాడబోతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల నిశ్చితార్థం వేడుక జరిగింది. ఆ తర్వాత అథర్ తన కాబోయే భార్యను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోలను చేశాడు. ఇద్దరు అక్టోబర్‌లో వీరిద్దరు నిఖా చేసుకోబోతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం అథర్ అమీర్ ఖాన్, డాక్డర్ మెహ్రీన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.