Earthquake | టిబెట్‌లో మళ్లీ భూకంపం.. నేపాల్లోనూ ప్రకంపనలు
Earthquake | టిబెట్ (Tibet) లో బుధవారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని ప్రభావంతో పొరుగు దేశమైన నేపాల్ (Nepal) లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలు (Ricter Scale) పై ఈ భూకంప తీవ్రత 5.3 గా నమోదైంది. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది.
Earthquake : టిబెట్ (Tibet) లో బుధవారం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని ప్రభావంతో పొరుగు దేశమైన నేపాల్ (Nepal) లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలు (Ricter Scale) పై ఈ భూకంప తీవ్రత 5.3 గా నమోదైంది. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఈ సంస్థ పేర్కొన్నది.
కాగా భారత జాతీయ భూకంప పరిశోధన కేంద్రం మాత్రం భూకంప తీవ్రతను 5.0 గా నిర్ధారించింది. టిబెట్‌లో సంభవించిన ఈ భూకంపం కారణంగా నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో, భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. గత గురువారం కూడా టిబెట్‌లో భూకంపం సంభవించింది.
అప్పట్లో దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైందని, భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- Nepal
- Telugu News
- Tibet
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

