న్యూఢిల్లీ, డిసెంబర్ 29: రక్షణశాఖ అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరబోతున్నది. బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైల్ ఎక్స్టెండెట్ రేంజ్ వెర్షన్‌ను భారత వైమానిక దళం గురువారం విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్-30 ఎంకే ఫైటర్ జెట్ నుంచి బంగాళాఖాతంలోని షిప్ లక్ష్యంగా మిస్సైల్‌ను ప్రయోగించారు. దీని రేంజ్ 450 కిలోమీటర్లు.