Religious Conversion: బలవంతంగా మతమార్పిడి.. ఐఏఎఫ్ ఆఫీసర్ భార్యకు వేధింపులు.. వీడియో వైరల్
Religious Conversion: నాగపూర్‌కు చెందిన 24 ఏళ్ల మహిళను బలవంతంగా మతమార్పిడి చేశారు. ఈ ఘటనలో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. రేప్, బ్లాక్మెయిల్, బెదిరింపులు, బలవంత మతమార్పిడి కింద కేసు బుక్ చేశారు.
నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన 24 ఏళ్ల మహిళను బలవంతంగా మతమార్పిడి(Religious Conversion) చేశారు. ఈ ఘటనలో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. రేప్, బ్లాక్మెయిల్, బెదిరింపులు, బలవంత మతమార్పిడి కింద కేసు బుక్ చేశారు. మతమార్పిడి చేస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వదిలేయ్ అని ఆ మహిళ అరుస్తున్నా.. ఓ వ్యక్తి ఇస్లామిక్ మంత్రాలు చదువుతూ ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ కేసులో అయ్యాజ్ తాజ్ మాదరే, అమీన్ షేక్‌లను అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఉన్న హజ్రత్ మౌలానా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు అయ్యాజ్ తాజ్ మాదరే, బాధిత మహిళ గతంలో ఒకే స్కూల్లో చదువుకున్నారు. అయితే ఓ ప్రాపర్టీ వివాదం నేపథ్యంలో ఆ ఇద్దరు కలుసుకున్నారు. 2025 ఫిబ్రవరిలో ఓ హోటల్లో ఆ మీటింగ్ జరిగింది. అప్పుడు ఏదో మత్తు పదార్ధాన్ని తనకు ఇచ్చినట్లు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అసభ్యకరమైన రీతిలో ఉన్న ఫోటోలు, వీడియోలను తీసి.. ఆమెను బెదిరించడం ప్రారంభించారు. బాధిత మహిళ భర్త భారతీయ వైమానిక దళంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతను నాగపూర్ అవతల పోస్టింగ్‌లో ఉన్నాడు. ఒకవేళ తాను చెప్పినట్లే వినకుంటే, ఆ ఫోటోలు, వీడియోలను భర్తకు చేరవేస్తామని ఆమెను బెదిరించారు.
గడిచిన కొన్ని రోజుల నుంచి బాధిత మహిళను బెదిరించి ఆమె నుంచి సుమారు 4 లక్షల దోచుకున్నారు. ఏదో ద్రవ పదార్థాన్ని తాగించేవారు అని, క్షుద్ర పద్ధతిలో కొన్ని పూజలు చేసేవారని, ఆ తర్వాత లైంగికంగా దాడి చేసేవారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. సోనేగావ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయినట్లు డీఎస్పీ రుషికేశ్ రెడ్డి తెలిపారు. మే 31వ తేదీన తనను కల్మేశ్వర్ ప్రాంతానికి తీసుకెళ్లారని, అక్కడ మతమార్పిడి పూజను చేశారని ఆమె పేర్కొన్నది. తన ఇష్టం లేకుండానే మతమార్పిడి చేయించి, ప్రధాని నిందితుడితో పెళ్లి జరిగినట్లు చెప్పారని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

