గురువారం 04 జూన్ 2020
National - May 07, 2020 , 15:33:58

ఎంఐ17 హెలికాప్ట‌ర్ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌..

ఎంఐ17 హెలికాప్ట‌ర్ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌..


హైద‌రాబాద్‌: భార‌తీయ వైమానిక ద‌ళానికి చెందిన ఎంఐ 17 హెలికాప్ట‌ర్‌.. ఇవాళ సిక్కింలో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. చేత‌న్ నుంచి ముకుతంగ్ మార్గంలో  మెయింటేనెన్స్ చెకింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. హెలికాప్ట‌ర్‌లో ఉన్న ఆరుగురు సుర‌క్షితంగానే ఉన్నారు.  ఈ ప్ర‌మాదంలో ఒక‌రు గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఉద‌యం 6.45 నిమిషాల‌కు బ‌య‌లుదేరిన హెలికాప్ట‌ర్‌.. నిర్దేశిత హెలిప్యాడ్ స‌మీపంలో వాతావ‌ర‌ణం స‌రిగాలేని కార‌ణంగా ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. హెలికాప్ట‌ర్‌కు భారీ ధ్వంసం జ‌రిగిన‌ట్లు తెలుస్తున్న‌ది. న‌లుగురు వైమానిక ద‌ళ‌, మ‌రో ఇద్ద‌రు ఆర్మీ సిబ్బంది సుర‌క్షితంగానే ఉన్నారు.


logo