IAF Apache | భారత వాయుసేనకు (IAF) చెందిన ఓ యుద్ధ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. పఠాన్‌కోట్ (Pathankot) వైమానిక దళ స్టేషన్ నుంచి బయల్దేరి నగంల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాలెడ్ గ్రామం వద్దకు రాగానే అపాచి హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ హెలికాప్టర్‌ను హుటాహుటిన గ్రామంలోని ఓ బహిరంగ ప్రదేశంలో అత్యవసరంగా కిందకు దించారు (emergency Landing). అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. హెలికాప్టర్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్‌కు కూడా ఎలాంటి నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. సాంకేతిక సమస్యలకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. వాయుసేన హెలికాప్టర్ గ్రామ సమీపంలో దిగడంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడారు.
Also Read..
Ahmedabad Plane Crash | ప్రాణాలతో ఎలా బయటపడ్డానో నాకే తెలియదు.. విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు