సిరియాకు చేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం..
రెస్క్యూ, వైద్య సిబ్బందితో పాటు రిలీఫ్ మెటీరియల్‌తో కూడిన ఇండియ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు సిరియాకు చేరుకున్నాయి. మంగళవారం బయల్దేరిన విమానాల్లో రిలీఫ్ మెటీరియల్, వైద్య, రెస్క్యూ సిబ్బందిని టర్కీకి పంపింది.
న్యూఢిల్లీ: భారీ భూకంపంతో కష్టాల్లో ఉన్న టర్కీ, సిరియాను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం తన వంతుగా సహాయం అందిస్తున్నది. ఇందులో భాగంగా రెస్క్యూ, వైద్య సిబ్బందితో పాటు రిలీఫ్ మెటీరియల్‌తో కూడిన ఇండియ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానాలు సిరియాకు చేరుకున్నాయి. మంగళవారం బయల్దేరిన విమానాల్లో రిలీఫ్ మెటీరియల్, వైద్య, రెస్క్యూ సిబ్బందిని టర్కీకి పంపింది. విమానంలో 6.5 టన్నుల ఔషధాలు, వైద్య ఉపకరణాలు, సర్జన్లు, పారామెడికల్ సిబ్బందిని తరలించింది. అదేవిధంగా 30 పడకల దవాఖానను అక్కడ నెలకొల్పేలా ఎక్స్‌రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, కార్డియాక్ మానిటర్లు కూడా వాటిలో ఉన్నాయి. ఇక 101 మంది జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు ప్రత్యేక విమానాల్లో అక్కడికి చేరుకున్నారు.

టర్కీ, సిరియా దేశాలపై సోమవారం వరుస భూకంపాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. భూకంపాల కారణంగా ఇప్పటి వరకు రెండు దేశాల్లో దాదాపు 7,700 మంది మరణించినట్టు అధికారిక, మీడియా వర్గాలు వెల్లడించాయి. టర్కీలో 4,500 మందికి పైగా మృత్యువాత పడ్డారని, 21 వేల మందికి పైగా గాయాలయ్యాయని ఆ దేశ ఉపాధ్యక్షుడు ఫుయత్ ఒక్తే తెలిపారు.

సిరియాలోని ప్రభుత్వ అధీన ప్రాంతాల్లో 800 మందికిపైగా, రెబల్స్ అధీన ప్రాంతాల్లో 1020 మంది మరణించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూలిన భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకొన్న వారి కోసం వెతుకులాట కొనసాగుతున్నది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తున్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రులతో దవాఖానలు నిండిపోయాయి. వైద్య సిబ్బంది అవిశ్రాతంగా పనిచేస్తున్నారని సిరియాకు చెందిన డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ మిషన్ హెడ్ సెబాస్టియన్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

