Pashupati Paras : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నాటికి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి (NDA alliance) విచ్ఛిన్నమవుతుందని అనిపిస్తోందని ‘రామ్‌విలాస్ లోక్ జనశక్తి పార్టీ (RLJP)’ ఛైర్మన్ పశుపతి పరాస్ (Pashupati Para) అన్నారు. ఆ కూటమిలోని పార్టీ మధ్య బంధం బలహీనమైనట్టు ఉన్నదని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా ప్రతిపక్ష మహాకూటమిలో సీట్ల పంపకం ఈ నెల 15-20 తేదీల మధ్య జరుగుతుందని పశుపతి పరాస్ చెప్పారు. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార కూటమిలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ ప్రధాన పార్టీలు కాగా.. ప్రతిపక్ష కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలు ఉన్నాయి.
పశుపతి పరాస్ నేతృత్వంలోని ఆర్జేఎల్పీ ప్రతిపక్ష కూటమిలో ఉంది. రామ్‌విలాస్ పాశ్వాన్ మరణానంతరం ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌తో సోదరుడు పశుపరాస్ విభేదించాడు. ఐదుగురు ఎంపీలున్న చిరాగ్ ఎన్డీఏకు దూరం జరగడంతో.. అతడి చిన్నాన్న పరాస్.. చిరాగ్ మినహా మిగతా ముగ్గురు ఎంపీలతో కలిసి ఎన్డీఏలో చేరారు. గత లోక్‌సభ ఎన్నికల్లో చిరాగ్ పార్టీ ఎన్డీఏలో చేరి తిరిగి ఐదు ఎంపీలు స్థానాలు గెలిచింది. పరాస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు.