న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) ఓటింగ్ యంత్రాలైన ఈవీఎంలపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిపై తనకు నమ్మకం లేదన్నారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులో వేసేలా వీవీప్యాట్ స్లిప్పులు ఓటర్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తిన ఒక వీడియోపై దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఈవీఎంలపై తనకు నమ్మకం లేదని 2003 నుంచి చెబుతున్నానని అన్నారు. ‘నేను ఎవరికి ఓటు వేయాలనుకున్నానో, నా ఓటు ఎక్కడ ఎవరికి వేశానో అన్నది నాకు తెలియదు. హ్యాక్ చేయలేని చిప్ ఉన్న యంత్రం ప్రపంచంలోనే లేదు. సాఫ్ట్వేర్ ద్వారా ఆ చిప్ అన్ని ఆదేశాలను అనుసరిస్తుంది’ అని తెలిపారు.
కాగా, ఓటు ఎవరికి వేశామన్నది వీవీప్యాట్ మెషిన్లో ఏడు సెకండ్ల పాటు కనిపించడంపైనా దిగ్విజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలో హస్తం (కాంగ్రెస్ గుర్తు)పై నొక్కితే, సాఫ్ట్‌వేర్‌లో ‘కమలం’ (బీజేపీ గుర్తు) అని కోడ్ ఇస్తే ఏమి జరుగుంది? అని ప్రశ్నించారు. వీవీప్యాట్ యంత్రం 7 సెకన్ల పాటు ‘హస్తం’ చూపిస్తుందని, మనం సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ‘కమలం’ గుర్తుగా స్లిప్‌లో ముద్రించే అవకాశముందని అన్నారు. రాహుల్ మెహతా వీడియో ద్వారా ఈ మాయాజాలాన్ని చూడవచ్చని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అందుకే అన్ని అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. కౌంటింగ్‌కు ఇంకొంత సమయం పడితే వచ్చే నష్టం ఏముంటుందని ప్రశ్నించారు. తాము కోరుకున్న వ్యక్తికే ఓటు పడిందని ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు.
మరోవైపు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్న తమ డిమాండ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ని కలిసేందుకు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ బ్లాక్ గత ఏడాది ఆగస్టు నుంచి ప్రయత్నించినా సమయం ఇవ్వలేదని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంమో లేదా ఈవీఎంలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వెళ్లడమో చేయాల్సి ఉందన్నారు. ‘గౌరవనీయ సీజేఐ దీనిని పరిగణలోకి తీసుకుంటారా? ఈవీఎంపై తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పిందని ఈసీఐ చెబుతోంది. సీజేఐ ఆదేశానుసారమే రాజకీయ పార్టీలను గుర్తిస్తారా? ఈవీఎంలకు సంబంధించిన ప్రశ్నలను కూడా ఈసీని అడగకూడదా? న్యాయం ఎక్కడ ఉంది?’ అని ప్రశ్నించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌పై ‘ఇండియా’ బ్లాక్ కూటమి త్వరలో నిర్ణయం తీసుకుటుందని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.
EVM Hack Still Possible: Listen The Engineer Who Demonstrated
Hari Prasad, in collaboration with American computer scientist J. Alex Halderman, and Rop Gonggrijp, a Dutch hacker, had exhibited two different methods of tampering with the machine to manipulate the results.
What… pic.twitter.com/ykh4gpUzFe
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) December 31, 2023
Thanks @pbhushan1 ji. This video is of pre VVPAT and therefore @ECISVEEP would say this issue has been settled. Now the voter can see for 7 seconds which candidate he has voted. But does it mean that the voter should not have the printed VVPAT slip in his hand to ensure that what… https://t.co/zlWLBPAUti
— digvijaya singh (@digvijaya_28) December 31, 2023