Naveen Patnaik : ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ ఇటీవల ఓ బహిరంగసభలో మాట్లాడుతుండగా ఆయన ఎడమచేయి వణకడం ఓ వీడియోలో కనిపించింది. దాంతో ఆయన పక్కనే ఉన్న ఒడిశా 5T ప్రాజెక్టు ఛైర్మన్ వీకే పాండియన్ పట్నాయక్ చేతిని దాచే ప్రయత్నం చేశారు. ఈ వీడియోను అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
Just note how Pandiyan is using Naveen Patnaik for power grab pic.twitter.com/izJ1gPJdw3
— Alok Bhatt (Modi Ka Parivar) (@alok_bhatt) May 28, 2024
దానిపై తాజాగా నవీన్ పట్నాయక్ స్పందించారు. ‘సమస్య కాని దాన్ని కూడా సమస్య చేయడం బీజేపీకి బాగా తెలుసు. అందుకే నా చేతుల గురించి వారు చర్చ లేవనెత్తారు. బీజేపీ ఓట్లు పిండుకోవడానికి ఈ కుయుక్తి అస్సలు పనిచేయదు’ అని వ్యాఖ్యానించారు.
#WATCH | On Assam CM HB Sarma’s recent tweet showing 5T Chairman and BJD leader VK Pandian & Odisha CM, Odisha CM Naveen Patnaik says, “I believe the BJP, which is known to make non-issues into issues, are discussing my hands. This will certainly not work.”
(Video Source: BJD) pic.twitter.com/aJLvdEJTu0
— ANI (@ANI) May 28, 2024