చెన్నై: సముద్ర జలాలతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే నూతన విధానాన్ని ఐఐటీ మద్రాస్‌కి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతుల కంటే ఇది ఎంతో ఉత్తమమైనదని, దీని ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని వారు తెలిపారు. అధ్యయన ఫలితాలను ఏసీఎస్ ఐప్లెడ్ ఎనర్జీ మెటీరియల్ జర్నల్‌లో ప్రచురించారు.
సౌర విద్యుత్తుతో ఈ టెక్నాలజీ పని చేస్తుంది. పరిశోధనలో భాగంగా సెల్యులోజ్ ఆధారిత సపరేటర్ కలిగి ఉన్న ఎలక్ట్రోలైజర్‌ను పరిశోధకులు ఉపయోగించారు. 391 చ.సె.మీ ఎలక్ట్రోలైజర్‌ను వినియోగించి గంటకు ఒక లీటర్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు తెలిపారు.