Hamad Airport | న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఖతార్ రాజధాని దోహాలోని ‘హమద్’ ఎయిర్పోర్ట్ 2024 సంవత్సరానికి గాను ‘ప్రపంచ ఉత్తమ విమానాశ్రయం’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. సింగపూర్‌లోని చాంజీ ఎయిర్‌పోర్టు 2వ స్థానం సాధించింది. ‘స్కైట్రాక్స్’ ఏటా వరల్డ్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్స్ జాబితాను విడుదల చేస్తుంది. టాప్-100లో భారత్ నుంచి హైదరాబాద్(61వ ర్యాంక్), ఢిల్లీ, బెంగళూరు, ముంబయి విమానాశ్రయాలకు స్థానం దక్కింది.