న్యూఢిల్లీ : మానవ గర్భస్థ పిండ ప్రతిష్ఠాపన (హ్యూమన్ ఎంబ్రియో ఇంప్లాంటింగ్) ప్రక్రియ ప్రత్యక్ష 3డీ వీడియో చిత్రీకరణ తొలిసారి జరిగింది. స్పెయిన్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ బయో ఇంజినీరింగ్ ఆఫ్ కెటలోనియా (ఐబీఈసీ) ఈ పరిశోధనను నిర్వహించింది. దీనికి అవసరమైన కృత్రిమ పిండాలను బార్సిలోనాలోని డెక్సెయుస్ యూనివర్సిటీ హాస్పిటల్ అందజేసింది.
శరీరంలో సహజంగా ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో చూపెట్టడం కోసం శాస్త్రవేత్తలు సింథటిక్ గర్భాశయ నమూనాను ఉపయోగించారు. ఐవీఎఫ్ వంటి సంతాన్య సాఫల్య చికిత్సల విజయ శాతాన్ని మెరుగుపరచడంలో ఈ వీడియో ఏ మేరకు ఉపయోగపడుతుందో పరిశోధకులు విశ్లేషించి చూశారు.