న్యూఢిల్లీ: ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో పార్కింగ్ వివాదం ప్రాణాలు తీసుకున్నది. నటి హుమా ఖురేషి(Huma Qureshi) సోదరుడు ఆసిఫ్ ఖురేషిని హత్య చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మర్డర్ జరిగింది. ఇంటి ప్రధాన ఎంట్రెన్స్‌కు దూరంగా స్కూటర్‌ను పార్కింగ్ చేయాలని అసిఫ్ ఖురేషి ఇద్దరు వ్యక్తలను కోరాడు. ఆ సమయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు.. మళ్లీ వస్తామని హెచ్చరించారు.
కేవలం పార్కింగ్ రిక్వెస్ట్ పెద్ద గొడవగా మారినట్లు అసిఫ్ భార్య వెల్లడించారు. గొడవకు దిగిన వ్యక్తి, తన సోదరుడితో వచ్చి.. ఓ పదునైన ఆయుధంతో ఆసిఫ్‌ను పొడిచినట్లు షాహీన్ చెప్పింది. ఈస్ట్ కైలాశ్ ప్రాంతంలో ఉన్న నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్కు అసిఫ్‌ను తరలించారు. కానీ ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు ద్రువీకరించారు. గతంలో కూడా అసిఫ్‌ను చంపేందుకు ప్రయత్నించినట్లు అతని భార్య ఆరోపించింది. నిందితుల్ని ఉజ్వల్, గౌతమ్‌గా గుర్తించారు. భారతీయ న్యాయ సంహితలోని 103 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
Delhi : Actor Huma Qureshi’s cousin, Asif Qureshi, was stabbed to death following an altercation over parking in southeast Delhi’s Bhogal. Two accused Ujjwal and Gautam have been apprehended in connection with the incident. One of the accused had attacked Asif Qureshi with a… pic.twitter.com/iLvoV0XY1V
— Mohammed Zubair (@zoo_bear) August 8, 2025