Netra Mantena | ఓర్లాండోకు చెందిన బిలియనీర్, ఫార్మా రంగంలో అతిపెద్ద దిగ్గజంగా ఎదిగిన రామరాజు మంతెన (Rama Raju Mantena) కుమార్తె నేత్ర మంతెన (Netra Mantena)–సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు వంశీ గదిరాజు (Vamsi Gadiraju) వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అంబానీ కుటుంబ వివాహాల తర్వాత భారతదేశంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్‌గా ఈ వేడుకలు నిలుస్తున్నాయి.
ఉదయ్‌పూర్ (Udaipur Wedding)లో నవంబర్ 21 నుంచి 23 వరకు జరిగిన ఈ ఉత్సవాల్లో బాలీవుడ్–హాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, మాధురీ దీక్షిత్, నోరా ఫతేహీ, దియా మీర్జా, రణ్వీర్ సింగ్, హాలీవుడ్ స్టార్ జెన్నీఫర్ వంటి ప్రముఖులు ఆడిపాడారు. ఈ రాయల్ వెడ్డింగ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వెడ్డింగ్‌కి దాదాపు రూ.100 కోట్లు ఖర్చైనట్లు సమాచారం.
పలు నివేదికల ప్రకారం.. ఈవెంట్లో ప్రదర్శన చేసినందుకు జెన్నిఫర్‌కు రూ.17 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వేడుకల్లో ఆడిపాడినందుకు మాధురి దీక్షిత్ రూ.35 లక్షల నుంచి రూ.కోటి, నోరా ఫతేహి రూ.50 లక్షల నుంచి రూ.కోటి, దియా మీర్జా రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఛార్జ్ చేసినట్లు సమాచారం. అంతేకాదు, వెన్యూకే దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చైనట్లు తెలుస్తోంది.
ఇక ఒక్కొక్కరికి భోజనం ఖరీదు రూ.8,500, హై టీ ధర ఒక్కొక్కరికి రూ.3,500, రాత్రి భోజనం రూ.12,000 వరకు ఉంటుందని సమాచారం. మొత్తం 65 రూమ్స్, 18 సూట్లను బుక్ చేశారు. వాటికి ఒక్కో రాత్రికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చైనట్లు తెలుస్తోంది. వీటికి తోడు ఇతర ఏర్పాట్లకు అయిన ఖర్చు రూ.40 లక్షలకుపైనే ఉండొచ్చని సమాచారం. మొత్తంగా పెళ్లికైన ఖర్చు రూ.100 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
Also Read..
Zubeen Garg | జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ మరణించలేదు.. ఆయన్ని హత్య చేశారు : సీఎం హిమంత శర్మ
Dharmendra | డెలివరీ టైమ్‌లో.. హేమ మాలిని కోసం మొత్తం నర్సింగ్ హోమ్‌నే బుక్ చేసిన ధర్మేంద్ర
Celina Jaitly | భర్తపై గృహ హింస కేసు పెట్టిన బాలీవుడ్ నటి