Celina Jaitly | బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ (Celina Jaitly) తన భర్త పీటర్ హాగ్ (Peter Haag)పై గృహ హింస కేసు (domestic violence case) పెట్టారు. అతని వల్ల తన ఆదాయాన్ని కోల్పోయానని, ఇందుకు గానూ రూ.50 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా భర్త పీటర్పై సెలీనా సంచలన ఆరోపణలు చేశారు. తనను శారీరకంగా, లైంగికంగా వేధించాడని ఆరోపించారు. తన మాటలతో వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల, పిల్లల పట్ల బాధ్యతగా ఉండటం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. అతడి వేధింపులు తాళలేక తాను ఆస్ట్రియా నుంచి పారిపోయి భారత్కు రావాల్సి వచ్చిందని వివరించారు. ఆమె పిటిషన్పై స్పందించిన కోర్టు పీటర్ హాగ్కునోటీసులు జారీ చేసింది. కాగా, ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త అయిన పీటర్ హాగ్ను సెలీనా 2011లో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు విన్ట్సన్, విరాజ్, ఆర్థర్ ఉన్నారు.
Also Read..
Zubeen Garg | జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ మరణించలేదు.. ఆయన్ని హత్య చేశారు : సీఎం హిమంత శర్మ
Dharmendra | డెలివరీ టైమ్లో.. హేమ మాలిని కోసం మొత్తం నర్సింగ్ హోమ్నే బుక్ చేసిన ధర్మేంద్ర
Apple layoff | యాపిల్ సేల్స్ విభాగంలో ఉద్యోగాల కోత..!