Viral news : స్కూల్లో ప్రిన్సిపల్ (Principal), లైబ్రేరియన్ (Librarian) మధ్య మొదలైన చిన్న గొడవ చివరికి రసాభాసగా మారింది. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. జట్లు లాక్కుని కొట్టుకున్నారు. ఈ ఇద్దరి కొట్లాటతో ఆ స్కూల్ కాసేపు రెజ్లింగ్ రింగ్ (Wrestling ring) లా మారిపోయింది. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఖర్గోన్ ఏరియా (Khargone area) కు చెందిన ఏకలవ్య ఆదర్శ పాఠశాల (Eklavya Adarsh School) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో ఏముందంటే.. ముందుగా ప్రిన్సిపల్, లైబ్రేరియన్ ఇద్దరూ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుంటూ కనిపించారు. ఈ క్రమంలోనే లైబ్రేరియన్ తన ఫోన్‌తో ప్రిన్సిపల్ తిట్లను రికార్డు చేయడం మొదలుపెట్టింది. దాంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్.. లైబ్రేరియన్‌ను చెంపపై కొట్టింది. ఆపై ఆమె ఫోన్‌ను లాక్కుని నేలకు కొట్టింది. ఫోన్ పగిలిపోయింది. దాంతో కోపంతో ఊగిపోయిన లైబ్రేరియన్ ‘నన్ను కొట్టడానికి నీకు ఎంత ధైర్యం..?’ అంటూ వాదనకు దిగింది.
ఈ క్రమంలో ప్రిన్సిపల్ తన ఫోన్లో లైబ్రేరియన్ వాదనను రికార్డు చేయడం స్టార్ట్ చేసింది. ఆగ్రహించిన లైబ్రేరియన్ ప్రిన్సిపల్‌పై చేయిచేసుకుంది. దాంతో ప్రిన్సిపల్ తిరగబడింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. చివరికి ఇద్దరూ అలిసిపోయి నిలబడ్డా ఒకరి జుట్టును ఒకరు మాత్రం విడిచిపెట్టలేదు. ఆఖరికి స్కూల్లో పనిచేసే ఆయా బతిమాలి ఇద్దరినీ విడిపించింది.
ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో స్కూల్ యాజమాన్యం ఇద్దరిని విధుల నుంచి తొలగించింది. వారిపై దర్యాప్తునకు ఆదేశించింది. కాగా ప్రిన్సిపల్, లైబ్రేరియన్ గొడవపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ప్రిన్సిపల్‌ను సమర్థిస్తూ కామెంట్స్ చేయగా, మరికొందరు లైబ్రేరియన్‌ను సమర్థించారు. ఓ నెటిజన్ ఈ కొట్లాటను పిల్లుల కొట్లాటగా అభివర్ణించారు. ఆ కొట్లాటకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడొచ్చు..
The school principal and librarian indulged into a physical fight at the premises of a government Eklavya School in Madhya Pradesh’s Khargone.
In the video, it can be seen, both the officials slapped each other, pulled hair, and pushed each other. The principal also broke the… pic.twitter.com/nk2z63oWIL
— ForMenIndia (@ForMenIndia_) May 4, 2025