సివాన్, సారణ్, అక్టోబర్ 17: బీహార్లోని సివాన్, సారణ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 24 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు గురువారం వెల్లడించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం నితీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో 25 మందికి పైగా వ్యక్తులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మద్యపానం, మద్యం అమ్మకాలపై నిషేధం విధించినందుకు వచ్చిన ప్రయోజనం ఏమిటని ప్రభుత్వాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. సీఎం, హోం శాఖ వైఫల్యమే ఇందుకు కారణమని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు.