కర్నాటక బీజేపీలో ముసలం పుట్టింది. మొన్నటికి మొన్న మంత్రి ఈశ్వరప్ప ఘటనను మరిచిపోక ముందే.. మరో ఘటన జరిగింది. రాష్ట్ర హోంమంత్రి అరాగా జ్ఞానేంద్రపై బీజేపీకి చెందిన బసన్‌గౌడ అనే ఎమ్మెల్యే తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనను వెంటనే పదవిలోంచి తీసేయాలని డిమాండ్ చేశారు. నేరాలను నియంత్రించడంలో హోంమంత్రి జ్ఞానేంద్ర ఘోరంగా విఫలమయ్యారని విరుచుకుపడ్డారు.
ఈ హోంమంత్రి శాంత స్వభావుడని, ఇంతటి శాంత స్వభావుడు ఆ శాఖకే పనికిరారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఆయనను హోంమంత్రిగా తప్పించి, ఇతర శాఖలు అప్పగించాలని ఆయన సూచించారు. తాను చేసిన ఈ డిమాండ్‌కు బీజేపీ అధిష్ఠానం స్పందిస్తుందని ఎమ్మెల్యే బసనగౌడ ఆశాభావం వ్యక్తం చేశారు.