Light Combat Aircraft: ఎల్సీఏ యుద్ధ విమానాన్ని ఐఏఎఫ్‌కు అందజేసిన హెచ్ఏఎల్
Light Combat Aircraft: లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎల్సీఏ) ట్విన్ సీటర్ శిక్షణ విమానాన్ని ఇవాళ భారతీయ వైమానిక దళానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ అందజేసింది. బెంగుళూరులో ఈ కార్యక్రమం జరిగింది. . అదనంగా మరో 83 ఎల్సీఏ విమానాలను అందజేయాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ చౌదరీ తెలిపారు.
బెంగుళూరు:స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(Light Combat Aircraft) ట్విన్ సీటర్ శిక్షణ విమానాన్ని ఇవాళ భారతీయ వైమానిక దళానికి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ అందజేసింది. బెంగుళూరులో ఈ కార్యక్రమం జరిగింది. హెచ్ఏఎల్ సీఎండీ సీబీ అనంతకృష్ణన్ ఆ విమానాన్ని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీకి అప్పగించారు. అదనంగా మరో 83 ఎల్సీఏ విమానాలను అందజేయాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ చౌదరీ ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం 97 ఎల్సీఏ విమానాలను ప్రొక్యూర్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
రాబోయే రోజుల్లో భారతీయ వైమానిక దళంలో మొత్తం 220 ఎల్సీఏ విమానాలు ఉంటాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ తెలిపారు. ఇది దేశం గర్వించదగ్గ విషయమన్నారు. రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ.. ఇవాళ చరిత్రాత్మక రోజు అన్నారు. హెచ్ఏఎల్కు రావడం గర్వంగా ఉందన్నారు. అన్ని ఒప్పందాలకు సాక్షిగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఐఏఎఫ్‌కు తొలి ఎల్సీఏ ట్విన్ సీటర్‌ను అందజేశామని ఆయన చెప్పారు. కొన్నాళ్ల క్రితం యుద్ధ విమానాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

