హిందూ మతం ప్రమాదంలో పడింది: బీజేపీ ఎమ్మెల్యే

ముంబై: హిందూ మతం ప్రమాదంలో పడిందని మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ఎత్తైన గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని, బహిరంగ మండపాల్లో నాలుగు అడుగుల ఎత్తు విగ్రహాలను మాత్రమే ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ వేడుకలపై ఆంక్షలు విధించిన మాదిరిగా మహారాష్ట్రలో పరిస్థితి ఉన్నదని బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే విమర్శించారు. కొత్త నిబంధనల ప్రకారం గణేష్ ఉత్సవ్ జరుపుకోవడం కష్టమని అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం క్రమంగా మహారాష్ట్రలో పండుగలను జరుపుకోని పరిస్థితిని సృష్టిస్తున్నదని విమర్శించారు.
తమ ఆందోళనను గవర్నర్ వద్ద వ్యక్తం చేసినట్లు నితేష్ రాణే చెప్పారు. ‘ఇటీవల ఇతర మతపరమైన పండుగలు జరుపుకున్నారు. వారు ఎలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కోలేదు. ఇప్పుడు హిందువులకు మాత్రమే ఎందుకు ఈ నిబంధనలు? హిందూ మతం ప్రమాదంలో ఉంది. మా పండుగలను కాపాడమని మేము గవర్నర్తో చెప్పాము. లేదంటే థాకరే ప్రభుత్వం పండుగలను క్రమంగా అంతం చేసే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశాము’ అని ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

