High Court | న్యూఢిల్లీ, జనవరి 29: ఇద్దరు హిందువుల మధ్య జరిగిన వివాహం ఎంతో పవిత్రమైనదని, వైవాహిక జీవితంలో అసాధారణమైన ఇబ్బందులంటే తప్ప అలాంటి వివాహాలను ఏడాదిలోగా రద్దు చేయడం కుదరదని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం విడాకులకు దరఖాస్తు చేసుకోవాలంటే వివాహం జరిగి కనీసం ఏడాదైనా గడిచి ఉండాలని, అసాధారణమైన ఇబ్బందులుంటేనే అలాంటి పిటిషన్ను విచారణకు స్వీకరించే వీలుంటుందని జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ డీ రమేశ్ ధర్మాసనం స్పష్టం చేసింది. నిశాంత్ భరద్వాజ్, రిషిక గౌతమ్ అనే దంపతులు తమ వివాహం రద్దు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి వైవాహిక జీవితంలో అసాధారణ పరిస్థితులున్నట్టు పేర్కొనకపోవడం వల్లే వారి దరఖాస్తును డిస్మిస్ చేస్తున్నామనితీర్పులో పేర్కొంది.