Tamil Nadu | పొల్లాచి(తమిళనాడు): కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో ఆదివారం రెండు రైల్వే స్టేషన్ల వద్ద నేమ్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలపై నల్ల రంగు పూసి తమిళ భాషాభిమానులు తమ నిరసన తెలిపారు. పొల్లాచి జంక్షన్ అని రాసి ఉన్న హిందీ అక్షరాలపై తమిళ భాషాభిమానులు నల్ల రంగు పూస్తున్న వీడియో ఒకటి ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే స్పందించిన అధికారులు దీన్ని సరిచేశారు.
నిందితులపై కేసు నమోదైంది. మరో సంఘటనలో పాలయన్కోటై రైల్వే స్టేషన్లోని నేమ్బోర్డుపై ఉన్న హిందీ అక్షరాలను నలుపు చేసిన డీఎంకే కార్యకర్తలపైనా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ఈపీ అమలుపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం నడుస్తున్నది.