Himachal Pradesh | గంజాయి సాగుకు గ్రీన్ సిగ్నల్.. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు హిమాచల్ సర్కారు సంచలన నిర్ణయం!
గ్యారెంటీల ప్రభావంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్న హిమాచల్ ప్రదేశ్‌ను బయటకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేసేందుకు అనుమతించాలని భావిస్తున్నది.
- ‘గ్యారెంటీ’ కష్టాలకు గంజాయితో చెక్
- ఏడాదికి 2 వేల కోట్ల ఆదాయమే లక్ష్యం
Himachal Pradesh | షిమ్ల, సెప్టెంబర్ 9: గ్యారెంటీల ప్రభావంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్న హిమాచల్ ప్రదేశ్‌ను బయటకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేసేందుకు అనుమతించాలని భావిస్తున్నది. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ సైతం వ్యతిరేకించపోవడం గమనార్హం. రాష్ట్రంలో గంజాయి సాగుకు గత ఏడాది అసెంబ్లీలో చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాల సూచన మేరకు రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యానవన నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పీకర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఔషధ, శాస్త్రీయ, పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్ధతిలో గంజాయి సాగు చేయాలని నిపుణుల బృందం ప్రతిపాదన చేసినట్టు మంత్రి నేగి తెలిపారు. గంజాయి సాగు సులభం కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చెప్పారు. గంజాయి సాగుకు అనుమతించేందుకు నార్కోటిక్ నిబంధనలను(ఎన్డీపీఎస్ చట్టం) సవరించాలని నిపుణుల కమిటీ సూచించినట్టు తెలిపారు.
ఆర్థిక కష్టాల నుంచి గట్టేక్కేందుకే
కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10 గ్యారెంటీలు ఇవ్వడంతో రాష్ట్రం మరింత దివాలా తీసింది. దీంతో ఇటీవల పలు సబ్సిడీలకు ప్రభుత్వం కోతలు పెడుతున్నది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను కూడా సమయానికి ఇవ్వలేదు. వేతనాలు ఆలస్యంగా ఇస్తే రాష్ర్టానికి నెలకు రూ.30 కోట్ల వడ్డీ మిగులుతుందని స్వయంగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో చెప్పారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గంజాయి సాగు కొంతమేరకు గట్టెక్కిస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. గంజాయి సాగుతో ఏడాదికి రూ.2,000 కోట్ల ఆదాయం రావొచ్చని గతంలో సీఎం సుఖు వ్యాఖ్యానించారు.
విద్యుత్తు వినియోగంపై పాలు, పర్యావరణ సెస్
రాష్ర్టాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన హిమాచల్ కాంగ్రెస్ సర్కారు.. దాన్నుంచి బయటపడేందుకు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నది. ఇప్పటికే పలు సబ్సిడీలకు కోతపెట్టిన సుఖ్విందర్ సుఖు ప్రభుత్వం.. తాజాగా విద్యుత్తు వినియోగంపై పాలు, పర్యావరణ సెస్‌లను విధించేందుకు సిద్ధమవుతున్నది. ముఖ్యమంత్రి సుఖు ఈ మేరకు ‘ది హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ (డ్యూటీ) అమెండ్మెంట్ బిల్లు, 2024’ను శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు. ప్రజలు వినియోగించే ఒక యూ నిట్ విద్యుత్తుకు 10 పైసలు పాల సెస్ విధించాలని ప్రతిపాదించారు. చిన్నతరహా పరిశ్రమలు వినియోగించే ఒక్కొక్క యూనిట్ విద్యుత్తుకు 2 పైసలు చొప్పున, మధ్యతరహా పరిశ్రమలకు 4 పైసల చొప్పు న, భారీ పరిశ్రమలకు 10 పైసల చొప్పున సెస్ విధించాలని ప్రతిపాదించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

