న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఉన్నత విద్యా సంస్థలను నియంత్రించడానికి 13 మంది సభ్యుల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘానికి(జేపీసీ) నివేదిస్తూ లోక్సభ మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో సభ దీన్ని ఆమోదించింది.
లోక్సభలో సోమవారం ఈ బిల్లును ప్రవేశపెట్టిన ప్రధాన్ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం జేపీసీలో లోక్సభ నుంచి 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు.