లక్నో: రాత్రి వేళ ఒక మహిళ హంగామా చేసింది. రోడ్డు మధ్యలో కూర్చొని వింతగా ప్రవర్తించింది. తల, చేతులను అటూ ఇటూ ఊపింది. నమస్కారాలు చేసింది. దీంతో అక్కడ జనం గుమిగూడారు. ఆ మహిళ వింత చేష్టలు చూసి షాక్ అయ్యారు. (Woman Sits On Road) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. మార్చి 19న రాత్రి 11 గంటల సమయంలో విభూతి ఖండ్ ప్రాంతంలోని లోహియా ఆసుపత్రి వద్ద ఉన్న రోడ్డు మధ్యలో ఒక మహిళ కూర్చొంది. ఆమె వింతగా ప్రవర్తించింది. తల అటూ ఇటూ తిప్పింది. చేతులు చాచి ముడిచింది. నమస్కారాలు చేసింది. ఆమె పక్కన ఒక బ్యాగ్ కూడా ఉన్నది. వాహనాల రాకపోకల మధ్య సుమారు 20 నిమిషాల పాటు ఈ హైడ్రామా కొనసాగింది.
కాగా, ఆ మహిళ విచిత్ర ప్రవర్తన చూసి జనం అక్కడ గుమిగూడారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. ఆమె వింత ప్రవర్తనతో ఆ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆమెను రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. ఆ మహిళ ఎవరు? ఆమె ఇలా ఎందుకు ప్రవర్తించింది? అన్నది ఆరా తీస్తున్నారు. మరోవైపు కొందరు వ్యక్తులు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Lucknow में बीच सड़क पर महिला का ड्रामा
विभूति खंड इलाके में देर रात महिला ने किया रहस्यमयी हंगामा
बीच सड़क बैठकर 20 मिनट तक करती रही अजीबोगरीब हरकतें
सोशल मीडिया पर वीडियो वायरल,महिला को सड़क से हटाया
प्रत्यक्षदर्शियों का दावा महिला की हरकतें सामान्य नहीं थी@lkopolice |… pic.twitter.com/FhQrMfHGJr
— News1India (@News1IndiaTweet) March 20, 2025