జైపూర్: వేగంతో వెళ్లిన ట్యాంకర్ అదుపుతప్పింది. మలుపు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్లపైకి దూసుకెళ్లి ఢీకొట్టింది. (Tanker Crash) దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ మంటల్లో కాలి సజీవదహనమయ్యాడు. రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం భిల్వారా-కోటా హైవేపై థర్మల్ బూడిద రవాణా చేస్తున్న ట్యాంకర్ హైస్పీడ్‌తో వెళ్లింది. లాడ్పురా కూడలి సమీపంలో అదుపుతప్పింది. అక్కడ ఆగి ఉన్న మూడు ట్యాంకర్లను ఢీకొట్టింది.
కాగా, ఈ ప్రమాదం ధాటికి ఆ ట్యాంకర్లో భారీగా మంటలు చెలరేగాయి. మిగతా ట్యాంకర్లకు మంటలు వ్యాపించాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఒక ట్యాంకర్ డ్రైవర్ మంటల్లో కాలి మరణించినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామ్‌ను సరి చేశారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bhilwara, Rajasthan: An accident occurred, where four tankers filled with thermal ash caught fire after colliding. . The flames led to the tragic death of tanker driver. Police and the fire brigade rushed to the scene and managed to control the fire. The police have taken the… pic.twitter.com/1Ja7tS1gPB
— IANS (@ians_india) March 21, 2025