న్యూఢిల్లీ: మరణ శిక్షల కేసుల్లో ఎడాపెడా శిక్షలు విధించకుండా ఉన్నత న్యాయస్థానాలు ఆచితూచి అడుగేస్తున్నాయి. గత పదేండ్ల మరణ శిక్షల డాటాను విశ్లేషించగా, ఇటీవలి కాలంలో హైకోర్టు ఏ మరణ శిక్షనూ ధ్రువీకరించ లేదు. హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీకి చెందిన క్రిమినల్ లా అడ్వకేసీ గ్రూప్ అయిన స్కేర్ క్లినిక్ చేసిన అధ్యయనం ప్రకారం వివిధ కేసుల్లో అధిక సంఖ్యలో దోషులకు మరణ శిక్షలు కింది కోర్టులు విధించినా అవి హైకోర్టు స్థాయిలో నిలబడ లేదు. ఈ నివేదిక ప్రకారం 2016-25 మధ్య దేశవ్యాప్తంగా ట్రయల్ కోర్టులు 822 కేసుల్లో 1,310 మందికి మరణ శిక్ష విధించాయి. అయితే 8 శాతం మరణశిక్షలను మాత్రమే హైకోర్టులు ధ్రువీకరించాయి. హైకోర్టులు ధ్రువీకరించిన 70 మరణ శిక్షల్లో, 38 సుప్రీం కోర్టు తీర్పులు ఇచ్చి ఒక్క దానిని కూడా సమర్థించలేదు.