చెన్నై: స్వలింగ జంటల వివాహానికి సుప్రీంకోర్టు చట్టబద్ధత కల్పించనప్పటికీ, వారు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని మద్రాస్ హైకోర్టు చెప్పింది. కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి వివాహం ఏకైక మార్గం కాదని స్పష్టం చేసింది. మహిళా భాగస్వామితో కలిసి ఉండటానికి ఓ యువతికి అనుమతి ఇచ్చింది. వీరిద్దరూ కలిసి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపింది.
‘కుటుంబం’ పదాన్ని విశాల భావంతో అర్థం చేసుకోవాలని పేర్కొంది. ఓ కేసు విచారణ సందర్భంగా గురువారం కోర్టు ఈ తీర్పునిచ్చింది. రక్త సంబంధం, చట్టబద్ధత లేకుండా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎల్జీబీటీక్యూఐఏప్లస్లో గుర్తింపు పొందిందని తెలిపింది.