
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: హైబ్రిడ్ పద్ధతిలో (ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో) కేసుల విచారణ ఉపయుక్తంగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.హైబ్రిడ్ విధానంలో వర్చువల్ విధానంతో పాటు ప్రత్యక్షంగా కోర్టులకు హాజరయ్యే వెసులుబాటు ఉన్నప్పటికీ, న్యాయవాదులు, ప్రజలు కోర్టు మెట్లు కూడా ఎక్కడం లేదని ధర్మాసనం పేర్కొంది. ‘కాబట్టి కోర్టు కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చి.. భౌతిక విచారణ జరుగాలి’ అని అభిప్రాయపడింది. మహమ్మారి సమయంలో పౌరులకు న్యాయసాయం దూరమవకూడదనే ఉద్దేశంతోనే హైబ్రిడ్ పద్ధతిలో విచారణకు అనుమతించిన విషయాన్ని గుర్తుచేసింది.