నీటి ఏనుగు దాడిలో పశు వైద్యురాలు మృతి
వన్యప్రాణులకు చికిత్స చేసేందుకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ సమీక్షారెడ్డిపై ఒక నీటి ఏనుగు (హిప్పొపొటామస్) దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది.
బెంగళూరు, మార్చి 20: వన్యప్రాణులకు చికిత్స చేసేందుకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ సమీక్షారెడ్డిపై ఒక నీటి ఏనుగు (హిప్పొపొటామస్) దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలోని త్యావరకొప్ప టైగర్, లయన్ సఫారీలో బెంగళూరుకు చెందిన సమీక్షారెడ్డి(27) కాంట్రాక్ట్ ఉద్యోగిగా సేవలు అందిస్తున్నది.
సన్కాపర్ పక్షికి చికిత్స చేసేందుకు గురువారం రాత్రి 10.30 గంటలకు సఫారీలోని పశు వైద్యశాలకు వెళ్లింది. చికిత్స అనంతరం అక్కడున్న నీటి ఏనుగు శరీర ఉష్ణోగ్రతను థర్మల్ కెమరాతో పరీక్ష చేస్తున్న సమయంలో అది దాడి చేసింది. దాడిలో అస్వస్థతకు గురైన డాక్టర్ను చికిత్స కోసం శివమొగ్గలోని మ్యాక్స్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించిందని త్యావరకొప్ప ఈడీ డాక్టర్ అమరాక్షర వెల్లడించారు. ఆమె మృతిపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

